SS రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్స్ ని రాబటింది. ఈ గ్లోబల్ బ్లాక్ బస్టర్ RRR (రైజ్ రోర్ రివోల్ట్) ఈ సంవత్సరం సాటర్న్ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రానికి అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు లభించినట్లు జ్యూరీ అధికారికంగా ప్రకటించింది.
ఈ యాక్షన్ డ్రామా మూవీలో అలియా భట్,సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. RRR ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.