కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం సిరుతై శివ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. సూర్య కెరీర్ లో 42వ సినిమాగా తెరెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చెయ్యలేదు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇటీవలే గోవా లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ షెడ్యూల్ లో ఒక పాట చిత్రీకరణ జరిగింది. ఈ చిత్రంలో సూర్య విభిన్న గెటప్స్ లో కనిపిస్తారట. అలానే సినిమాలో బోలెడన్ని వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయట. డైరెక్టర్ శివ ఈ సినిమాకు అదిరిపోయే స్క్రిప్ట్ ను అందించారట. ఈ విషయాలను ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
![]() |
![]() |