నవంబర్ 4న థియేటర్లలో విడుదల కాబోతున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూవీ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు అక్టోబర్ 29వ తేదీ సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ లో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని, ఈ ఈవెంట్కు నాచురల్ స్టార్ నాని గారు చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారని కొంచెంసేపటి క్రితమే ఈ మూవీ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
మేర్లపాక గాంధీ డైరెక్షన్లో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమాను ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa