నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "తగ్గేదేలే". ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ థ్రిల్లింగ్ గా సాగడంతో ఈ రోజు విడుదల కాబోతున్న ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాస రాజు డైరెక్షన్లో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నవంబర్ నాలుగున విడుదల కావడానికి రెడీ అవుతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ రోజు సాయంత్రం ఐదింటికి తగ్గేదేలే మూవీ ట్రైలర్ విడుదల కాబోతుంది. టాలీవుడ్ యంగ్ హీరో, కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా గ్రాండ్ సక్సెస్ ను అందుకున్న నిఖిల్ సిద్దార్థ్ ఈ ట్రైలర్ ను లాంచ్ చెయ్యబోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa