నటకిరీటి రాజేంద్రప్రసాద్, వెటరన్ యాక్టర్ నరసింహ రాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "అనుకోని ప్రయాణం".
యాపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డీవై జగన్ మోహన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, వెంకటేష్ డైరెక్ట్ చేస్తున్నారు. సీనియర్ హీరోయిన్ ప్రేమ, శుభలేఖ సుధాకర్, తులసి, రవిబాబు, తాగుబోతు రమేష్ నారాయణరావు, అనంత్, ప్రభాస్ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 28వ తేదీన అంటే రేపే థియేటర్లలో విడుదల కాబోతుంది.
చాన్నాళ్ల తరవాత రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం విడుదల కాబోతుండడంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి డీసెంట్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa