ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న "అందరూ బాగుండాలి అందులో నేనుండాలి"

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 28, 2022, 10:21 AM

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ గారు నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం "అందరూ బాగుండాలి అందులో నేనుండాలి". శ్రీపురం కిరణ్ ఈ సినిమాకు డైరెక్టర్.


ఈ రోజునే ఈ మూవీ ఆహా ఓటిటిలో రిలీజ్ అయ్యింది. వికృతి అనే మలయాళ మూవీకి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో ఆలీ, నరేష్ ప్రధాన పాత్రలు పోషించారు. నరేష్ ఈ సినిమాలో మూగవాడిగా నటించారు. నిజ జీవితంలో సోషల్ మీడియా సైడ్ ఎఫెక్ట్స్  ఏమేరకు మనల్ని ఇబ్బంది పెడతాయో కళ్ళకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించారు.


పవిత్రా లోకేష్, మంజు భార్గవి, తనికెళ్ళ భరణి, మనో, LB శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు రాకేష్, భాస్కర్ సంగీతం అందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa