కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ నటిస్తున్న కొత్త చిత్రం "తునివు". ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. అజిత్ కెరీర్ లో 61వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకుడు.
2023 పొంగల్ బరిలో గ్రాండ్ గా పోటీ చెయ్యబోతున్న ఈ సినిమాపై ఇంటరెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. తునివు తమిళనాడు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జైంట్ మూవీస్ కొనుగోలు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో, పొలిటికల్ లీడర్, బిజినెస్ మ్యాన్ ఉదయనిధి స్టాలిన్ సొంత నిర్మాణ సంస్థే రెడ్ జైంట్ మూవీస్.
బే వ్యూ ప్రాజెక్ట్స్ , జీ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa