నిన్న సాయంత్రం విడుదలైన తగ్గేదేలే థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వస్తుంది. ఇంకా 24 గంటలు కూడా గడవక ముందే ఈ ట్రైలర్ కు యూట్యూబులో 2. 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పర్ఫెక్ట్ సీరియల్ కిల్లింగ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ ట్రైలర్ సినిమాపై చాలా మంచి అంచనాలను నెలకొల్పింది.
నవీన్ చంద్ర ఈ సినిమాలో సీరియల్ కిల్లర్ గా నటిస్తున్నారు. శ్రీనివాస రాజు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 4న విడుదల కావడానికి రెడీగా ఉన్న ఈ మూవీని భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ పాండే, అఖిలేష్ రెడ్డి, సుబ్బా రెడ్డి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa