దిగ్గజ దర్శకుడు మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా రూపొందిన పొన్నియిన్ సెల్వన్ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదలై చాలా మంచి కలెక్షన్లను రాబడుతోంది. సినిమా విడుదలై 25 రోజులు దాటుతున్నా ఇప్పటికీ తమిళనాడు కలెక్షన్స్ లో ఈ సినిమా జోరు చూపిస్తుంది.
ఇదిలా ఉండగానే, ఈ సినిమా రెంటల్ బేస్ పై డిజిటల్ స్ట్రీమింగ్ కొచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతానికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం ప్రైమ్ సబ్స్క్రైబర్ అయినా సరే 199 రూపాయలు చెల్లించి సినిమాను చూడాలి. ఇకపోతే, నవంబర్ 4 నుండి ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రీమియర్ స్ట్రీమింగ్ కి రాబోతుంది. అదికూడా తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషలలో మాత్రమే. హిందీలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పటి నుండి అన్న విషయం ఇంకా తెలియల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa