పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ నటించిన 'సర్దార్' సినిమా అక్టోబర్ 21న దీపావళికి గ్రాండ్‌గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా అన్ని చోట్లా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం అందరినీ ఆకట్టుకోవడంతో రెండో వారంలో స్క్రీన్ కౌంట్ 380 నుంచి 500+కి పెరిగిందనేది లేటెస్ట్ టాక్.
ఈ సినిమాలో రాశి ఖన్నా, రజిషా విజయన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విలన్‌గా చుంకీ పాండే నటించాడు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో లైలా, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa