నవంబర్ 4న తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతున్న "ఆకాశం" మూవీకి సంబంధించి ఈ రోజు రాత్రి ఏడింటికి థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుంది. విశేషమేంటంటే, నాచురల్ స్టార్ నాని ఈ ట్రైలర్ ను డిజిటల్ లాంచ్ చెయ్యబోతున్నారు. తమిళంలో "నితం ఒరు వానం" టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ను స్టార్ హీరోలు, అన్నదమ్ములు సూర్య మరియు కార్తీ విడుదల చెయ్యనున్నారు. ఈ మేరకు కొంచెంసేపటి క్రితమే అధికారిక ప్రకటన వెలువడింది.
రా కార్తీక్ డైరెక్షన్లో డిఫరెంట్ లైఫ్ జర్నీ స్టోరీ గా రూపొందిన ఈ సినిమాలో అశోక్ సెల్వన్, రీతూవర్మ, శివాత్మిక, అపర్ణా బాలమురళి హీరో హీరోయిన్లుగా నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa