క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న 21 వ సినిమా "రంగమార్తాండ". హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు రమ్యకృష్ణ తన పార్ట్ కి సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేసారు. ఈ మేరకు ఆమె డబ్బింగ్ చెప్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవలే ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కూడా తమ డబ్బింగ్ పార్ట్ ను పూర్తి చేసారు.