బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం "స్వాతిముత్యం". లక్ష్మణ్ కే కృష్ణ డైరెక్షన్లో ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో విడుదలై, చాలామంచి రివ్యూలను పొందింది.
కొన్ని రోజుల నుండి ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తాజాగా 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను పూర్తి చేసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.