రాఘవ లారెన్స్ ... డాన్సర్ గా సినీ కెరీర్ ను స్టార్ట్ చేసి ఆపై కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, డైరెక్టర్ గా, కంపోజర్ గా, సింగర్ గా తనలోని విభిన్న ప్రతిభను ప్రేక్షకులకు ప్రదర్శిస్తూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.
ఈ రోజు రాఘవ లారెన్స్ 46వ పుట్టినరోజు ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తను గురువుగా భావించే, తలైవర్ రజినీకాంత్ గారిని ఆయన స్వగృహంలో పర్సనల్ గా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రతి పుట్టినరోజుకు ఏదో ఒక సోషల్ సర్వీస్ చేసే లారెన్స్ ఈ సారి అన్నదానం చెయ్యబోతున్నట్టు తెలిపారు. ఇక సినిమాల విషయానికొచ్చేసరికి, ప్రస్తుతం లారెన్స్ చంద్రముఖి 2, అధికారి, రుద్రుడు సినిమాలలో హీరోగా నటిస్తున్నారు.