పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం "హరిహర వీరమల్లు". పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతున్న ప్రముఖ హిందీ నటుడు అర్జున్ రాంపాల్ ప్లేస్ లో తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ నటించబోతున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి, ఈ విషయంలో అధికారిక క్లారిటీ రావలసి ఉంది.
మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై AM రత్నం సమర్పిస్తున్న ఈ సినిమాను దయాకర్ రావు నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నారు.