కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒకేవేదికపై త్వరలోనే కనబడనున్నారు. కన్నడ పవర్ స్టార్ లేట్ పునీత్ రాజ్ కుమార్ గారికి కర్ణాటక ప్రభుత్వం 'కర్ణాటక రత్న' అవార్డుతో సత్కరించబోతుంది. ఈ మేరకు నవంబర్ 1వ తేదీన జరగనున్న కన్నడ రాజ్యోత్సవ వేడుకలలో ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరగబోతుంది. ఈ ఈవెంట్ కు కర్ణాటక ప్రభుత్వం సూపర్ స్టార్ రజినీకాంత్ ను, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ లుగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా రజిని మరియు తారక్ ఒకే వేదికను పంచుకోనున్నారు.