‘పెళ్లి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాలతో సుపరిచితమైన నటుడు పృథ్వీరాజ్ (57). తన కంటే చాలా చిన్నవయసున్న యువతిని ఆయన రెండో పెళ్లి చేసుకున్నారంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అయితే శీతల్ (24) అనే అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు స్పష్టంచేశారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. భార్యతో ఆరేళ్లుగా గొడవల కారణంగా ఇంట్లోంచి వచ్చేసి వేరుగా ఉంటున్నట్లు చెప్పారు. ఒంటరితనం, కుంగుబాటుకు లోనైన సమయంలో శీతల్‌తో పరిచయం ఏర్పడిందన్నారు.