డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, బోయపాటి శ్రీను ల కాంబినేషన్‌లో వస్తున్న ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్ విడుదల చేసేందుకు నిర్మాత ఏర్పాట్లు చేసారు. యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో అభిమానుల కోలాహలం నడుమ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్టు చిత్ర వర్గాలు చెప్పాయి. గురువారం జరగే ఈ విడుదల కార్యక్రమ సభకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతుండగా, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ముఖ్య అతిధిగా పాల్గొని ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన రెండు పాటలు, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెప్పాయి. ముందుకు తీసుకురానున్నారు.
నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అడ్వాణీ కథానాయికగా నటించగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటించారు. ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa