నైట్రో స్టార్ సుధీర్ బాబు ప్రస్తుతం హంట్, మాయా మశ్చీంద్ర అనే సినిమాల షూటింగులతో బిజీగా ఉన్నారు. వీటితోపాటు సుధీర్ మరొక సినిమాను కూడా తాజాగా ఎనౌన్స్ చేసారు.
ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారకా దర్శకుడు. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఎడిటర్ గా రవితేజ గిరిజాల పేరును మేకర్స్ ఎనౌన్స్ చేసారు. నాని నటించిన రీసెంట్ ఫిలిం అంటే సుందరానికి సినిమాకు రవితేజ ఎడిటర్ గా పని చేసారు.