అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ సంగీత దర్శకులుగా పని చేస్తున్న చిత్రం "ఊర్వశివో రాక్షసివో". ఇప్పటివరకు ఈ సినిమా నుండి నాలుగు పాటలు విడుదలవ్వగా, అన్ని కూడా చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. టీజర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా మ్యూజిక్ ఆల్బం తో చాలా మంచి అంచనాలను నెలకొల్పింది.
ఈ సినిమా నుండి ఫోర్త్ లిరికల్ గా విడుదలైన కలిసుంటే అనే రొమాంటిక్ మెలోడీ లేటెస్ట్ గా యూట్యూబులో 1 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. అచ్చు రాజమణి స్వరపరిచిన ఈ గీతాన్ని అర్మాన్ మాలిక్ ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు.
రాకేష్ శశి డైరెక్షన్లో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.