మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్గానే జపాన్ లో RRR ప్రమోషన్స్ ను చేసారు. ఈ ముమ్మర ప్రచారంలో అలిసిపోయిన చరణ్ అటు నుండి అటే ఆఫ్రికా కి వెకేషన్ కి వెళ్లారు. ఈ మేరకు చరణ్ ఆఫ్రికాలో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో చరణ్ ఫోర్ వీలర్ రైడ్ చేస్తారు. ఇంకా చెఫ్ గా మారి వంట చేస్తుంటారు. ఆపై వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారి జంతువుల ఫోటోలు తీస్తూ కనిపిస్తారు. బ్లూ కలర్ జాకెట్ లో చెర్రీ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పోతే, వచ్చే వారంలోనే చెర్రీ హైదరాబాద్ వస్తారంట.