టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుండి ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు వచ్చాయి కానీ, ఏ ఒక్క సినిమా కూడా కిరణ్ కు సాలిడ్ హిట్ ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న కొత్త సినిమాపైనే అందరి దృష్టి నిలిచింది.
కిరణ్ అబ్బవరం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో చేస్తున్న చిత్రం "వినరో భాగ్యము విష్ణు కథ". ఈ సినిమాలో కాశ్మీర హీరోయిన్ గా నటిస్తుండగా,మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
కొంచెంసేపటి క్రితమే మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మేరకు ఈ సినిమా వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa