మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం "గాడ్ ఫాదర్". ఈ సినిమాలో చిరు, సల్మాన్ కలిసి డాన్స్ వేసే తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ కి ఫ్యాన్స్ విజిల్స్ తో థియేటర్ల గోడలు మోతెక్కిపోయాయి.
రెండు వారాల క్రితం ఈ పాటను పూర్తి వీడియో రూపంలో మేకర్స్ విడుదల చేసారు. ప్రభుదేవా ఈ సాంగ్ ను డైరెక్ట్ చెయ్యగా, శాండీ కొరియోగ్రఫీ చేసారు. తమన్ స్వరపరిచిన ఈ పాటను శ్రేయాఘోషల్ ఆలపించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. తాజాగా ఈ పాటకు యూట్యూబులో పది మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి.
పోతే, మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ సీరియస్ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో నయనతార, సత్యదేవ్, సునీల్, షఫీ, పూరి జగన్నాధ్ కీలకపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa