ఎనర్జిటిక్ హీరో రామ్, యంగ్ బ్యూటీ కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం "ది వారియర్". కెరీర్ లో రామ్ తొలిసారిగా నటించిన తెలుగు, తమిళ బై లింగువల్ ఐన ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి డైరెక్ట్ చేసారు.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రేపు సాయంత్రం ఆరింటికి ప్రముఖ స్టార్ మా ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కావడానికి రెడీ గా ఉంది. అద్దిరిపోయే మ్యూజిక్ ఆల్బమ్ ఉన్న ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి స్పందన దక్కించుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa