నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న చిత్రం తగ్గేదేలే. నవంబర్ 4వ తేదీన ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ కావడానికి రెడీ ఐన ఈ సినిమా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు రేపు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్, మాదాపూర్ లోని దసపల్లా కన్వెన్షన్ హాల్ 2 లో తగ్గేదేలే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. మరి, ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారో తెలియాల్సి ఉంది.
నవీన్ చంద్ర, దివ్యా పిళ్ళై జంటగా నటించిన ఈ సినిమాకు దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాసరాజు డైరెక్టర్. రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్ పాండే, రాజా రవీంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాను భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa