మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న కొత్త చిత్రం "వాల్తేరు వీరయ్య". మాస్ రాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు బాబీ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవలే క్రేజీ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా మరొక సాంగ్ షూటింగ్ కోసం సిద్ధమైంది. అంతకుముందు చిరు, రవితేజలపై మాస్ సాంగ్ చిత్రీకరణ జరిగిన విషయం తెలిసిందే కదా. ఈసారి మెగాస్టార్ మాస్ ఇంట్రో సాంగ్ ను చిత్రీకరించనున్నారట. ఇందుకోసం హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో భారీ సెట్ ను రూపొందించారట.
శృతి హాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.