తెలుగు, తమిళం, హిందీ చిత్ర పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న హన్సిక పెళ్ళికి సంబంధించిన పలురకాల వార్తలు కొన్నాళ్ళబట్టి మీడియాలో వస్తున్న విషయం తెలిసిందే.
లేటెస్ట్ గా కొంచెంసేపటి క్రితమే హన్సిక నుండి పెళ్లి వార్తలపై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. హన్సిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన మ్యారేజ్ ప్రొపోజల్ పిక్స్ ను పెట్టి 'నౌ అండ్ ఫరెవర్' అని కామెంట్ చేసింది. ఈఫిల్ టవర్ కు దగ్గరలో హన్సిక మ్యారేజ్ ప్రపోజల్ డ్రీమి వే లో జరిగింది. ఇంతకూ హన్సిక మనసు గెలుచుకున్న అబ్బాయేవారో తెలుసా... సోహెల్ కతూరియా. పాపులర్ గార్మెంట్ బ్రాండ్ Avante కి యజమాని.
డిసెంబర్ 2 - 4వ తేదీ వరకు జైపూర్ ముందోట కోటలో హన్సిక వివాహ వేడుకలు జరగనున్నాయి. డిసెంబర్ 4వ తేదీన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హన్సిక, సోహెల్ ను పరిణయమాడనుంది.