ఈ రోజు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కొంచెంసేపటి క్రితమే "పఠాన్" టీజర్ రిలీజ్ అయ్యింది. సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా, జాన్ అబ్రహం విలన్గా నటిస్తున్నారు.
ఇక తాజాగా విడుదలైన టీజర్ హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ తో, హై రేంజ్ మాస్ హీరో ఎలివేషన్స్ తో గూజ్ బంప్స్ తెప్పిస్తుంది. షార్ట్ గ్యాప్ తదుపరి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న షారుఖ్ ఖాన్ కు పఠాన్ గ్రాండ్ సక్సెస్ ను తీసుకొచ్చేలానే కనిపిస్తుంది.
పోతే, ఈ సినిమా 25 జనవరి, 2023లో హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.