బాలీవుడ్ బాద్ షాగా పేరొందిన షారుఖ్ ఖాన్ ఒకప్పుడు ఎంత సంచలనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఖాన్ 1992లో 'దీవానా' సినిమాతో సెకండ్ హీరోగా కెరీర్ ప్రారంభించి తన నటనతో, స్టైల్ తో అభిమానుల మనసు దోచుకున్నాడు. మొదట్లో నెగిటివ్ రోల్స్ కే పరిమితమైన షారుక్ ఆ తర్వాత 15 ఏళ్లకు పైగా లవర్ బాయ్ గా, ఫ్యామిలీ హీరోగా బాలీవుడ్ ను శాసించాడు. ఈరోజు షారుఖ్ 57వ వసంతంలోకి అడుగుపెట్టాడు. అయితే ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటి ముందు అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఎప్పటిలాగే ఈసారి కూడా.. షారూఖ్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు తెల్లవారుజాము నుంచే అభిమానులు భారీగా ఆయన నివాసం ముందు చేరుకున్నారు. వారి ప్రేమ, ఆప్యాయతలను కళ్లారా చూసేందుకు తన బంగ్లా పైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేశాడు. చేయి ఊపుతూ అభిమానులను ఉత్సాహపరిచాడు. షారుక్‌తో పాటు 9 ఏళ్ల కుమారుడు అభి రామ్ కూడా ఉన్నాడు. బాల్కనీలో నిలబడి అభిమానులకు హాయ్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.