ప్రముఖ హీరోయిన్ హన్సిక త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సొహైల్‌ను ఆమె పెళ్లాడనుంది. డిసెంబర్ 4న జైపూర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. ఈఫిల్ టవర్ వద్ద తనకు సొహైల్ ప్రపోజ్ చేస్తున్న ఫొటోను హన్సిక స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.