కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ తో మాస్ రాజా రవితేజ నిర్మిస్తున్న చిత్రం "మట్టి కుస్తీ". కొంచెంసేపటి క్రితమే మూవీ ఫస్ట్ లుక్ ను రవితేజ విడుదల చేసారు. కంప్లీట్ స్పోర్ట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మట్టి కుస్తీ నేపథ్యంలో తెరకెక్కుతుంది.
చెల్లా అయ్యావు ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. RT టీం వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ సంయుక్త బ్యానర్ లపై రవితేజ, విష్ణు విశాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో అతి త్వరలోనే ప్రేక్షకులను పలకరించబోతుంది.