గాడ్ ఫాదర్, రామ్ సేతు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న సత్యదేవ్ నుండి 'ఫుల్ బాటిల్' అనే కొత్త సినిమా రాబోతుంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. మెర్క్యూరీ సూరి అనే క్రేజీ ఆటో డ్రైవర్ పాత్రలో సత్యదేవ్ లుక్ నెవర్ బిఫోర్ సీన్ అవతార్ లో కనిపిస్తూ, సినిమాపై ఇంటరెస్ట్ ను కలుగజేస్తుంది.
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సత్యదేవ్ సొంత ప్రొడక్షన్ హౌస్ SD కంపెనీతో కలిసి సర్వంత్ రామ్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.
![]() |
![]() |