విశ్వనటుడు కమల్ హాసన్ - దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో రాబోతున్న ఐకానిక్ మూవీ "ఇండియన్" సీక్వెల్ ఇటీవలే పునఃప్రారంభించబడిన విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో తాజాగా ఒక కొత్త వ్యక్తి జాయిన్ అయ్యారు. ఆయనెవరో కాదు... ఇండియన్ క్రికెటర్ యువ్ రాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్.
ఇండియన్ 2 సినిమా షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అవుతున్న యోగ్ రాజ్ సింగ్ తన మేకప్ రూమ్ నుండి ఒక పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీంతో యోగ్ రాజ్ ఇండియన్ 2 సినిమాలో కమల్ తో పాటు నటించడానికి సిద్ధమయ్యారని అధికారికంగా తెలుస్తుంది.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సిద్దార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa