కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పుట్టినరోజు నిన్న గ్రాండ్ గా జరిగింది. ఆయన బర్త్ డే కానుకగా పఠాన్ టీజర్ ను రిలీజ్ చేసి, ఫ్యాన్స్ ను ఖుష్ చేసారు మేకర్స్. హై రేంజ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో, మాస్ ఎలివేషన్స్ తో టీజర్ ఐతే బాగానే ఉంది.
కొంతమంది నెటిజన్లు మాత్రం పఠాన్ టీజర్ అచ్చు మన ప్రభాస్ నటించిన 'సాహో' ను పోలివుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకు వచ్చిన యాక్షన్ సినిమాలలో సాహో టీజర్ ఒక స్టాండర్డ్ ని సెట్ చేసి పెట్టిందని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతారు. ప్రభాస్ సాహో టీజర్, VFX తో పోలిస్తే, పఠాన్ టీజర్ తేలిపోయిందని అంటున్నారు. ఎందుకంటే, సాహో లో ప్రభాస్ వాడిన జెట్ ప్యాక్, భూమ్ అనే డైలాగ్, యాజిటీజ్ పఠాన్ టీజర్ లో కూడా ఉంటాయి. ఈ రెండు టీజర్లను బిట్ టు బిట్ పోల్చి చూసి, సేమ్ టు సేమ్ కాపీ అంటున్నారు. మరికొంతమందేమో హృతిక్ రోషన్ సూపర్ హిట్ ఫిలిం 'వార్' సినిమాకు పఠాన్ రీమేక్ అనుకుంటా అని కామెంట్లు పెడుతున్నారు.