దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కిన అందమైన ప్రేమకథాచిత్రం "సీతారామం". వైజయంతి మూవీస్ బ్యానర్ పై CH అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు.
అద్భుతమైన థియేటర్ రన్ ను ముగించుకుని డిజిటల్ లో కూడా సందడి షురూ చేసిన ఈ మూవీ హిందీ వెర్షన్ మాత్రం ఇంకా ఓటిటి ఎంట్రీ ఇవ్వలేదు. లేటెస్ట్ గా సీతారామం హిందీ వెర్షన్ డిజిటల్ ఎంట్రీ కి డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. సీతారామం హిందీ వెర్షన్ నవంబర్ 18 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయ్యింది.
రష్మిక మండన్నా, సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా క్లాసికల్ హిట్ గా నిలిచింది.