ప్రముఖ కన్నడ నిర్మాణసంస్థ హోంబలే ఫిలిమ్స్ దాదాపు పదహారు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన రీజినల్ కన్నడ ఫిలిం "కాంతార" గ్లోబల్ లెవెల్లో కలెక్ట్ చేస్తున్న మొత్తం తెలిస్తే, నోరెళ్లబెట్టాల్సిందే. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా 305 కోట్ల పై చిలుకు కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డివైన్ బ్లాక్బస్టర్ గా నిలిచింది.
థియేటర్లలో విడుదలై మూడు వారాలు గడుస్తున్నప్పటికీ కాంతార హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవ్వడం చూసి సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కాంతార బిగ్ స్క్రీన్ పై ఆవిష్కరించిన అద్భుతమైన మాయాజాలం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవ్వడమే ఇందుకు ప్రధాన కారణం.
రిషబ్ శెట్టి డైరెక్షన్లో ఆయనే హీరోగా నటించిన ఈ సినిమాలో సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, కిషోర్, మానసి సుధీర్ కీలకపాత్రలు పోషించారు.