ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాజల్ అగర్వాల్ రిలీజ్ చెయ్యనున్న 'మట్టికుస్తీ' సెకండ్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 09:32 AM

మాస్ రాజా రవితేజ నిర్మాణ సంస్థ RT టీం వర్క్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న చిత్రం "మట్టికుస్తీ". కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ఇందులో హీరోగా నటించడమే కాక సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చెల్లా అయ్యావు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.


నిన్ననే ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రవితేజ విడుదల చెయ్యగా, ఈ రోజు పదకొండింటికి సెకండ్ లుక్ రివీల్ కాబోతుంది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మట్టి కుస్తీ సెకండ్ లుక్ ను రివీల్ చెయ్యబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.


మట్టి కుస్తీ నేపథ్యంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com