సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై నటి కరాటే కళ్యాణితో పాటు పలు హిందూ సంఘాలు సైబర్ క్రైమ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాయి. 'ఓ పరి' ఆల్బమ్‌లో 'హరేరామ హరేకృష్ణ' అనే మంత్రాన్ని ఐటెం సాంగ్‌గా చిత్రీకరించారని, దేవిపై చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ అశ్లీల వేషధారణలు, నృత్యాలతో పవిత్ర మంత్రాన్ని చిత్రీకరించి హిందూ మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు.