హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన సినిమా 'అవతార్'. ఈ సినిమా 2009లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్స్‌ను రూపొందిస్తున్నాడు జేమ్స్ కామెరూన్. షూటింగ్ పూర్తి చేసుకున్న 'అవతార్-2' సినిమా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్రబృందం.