ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ స్టోరీ కత్రినా,ర‌ణ్‌బీర్ దేనా..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 28, 2018, 07:20 PM

 బాలీవుడ్ స్టార్లు షారుక్‌ఖాన్, అనుష్క శర్మ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం జీరో. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ ‘బబితా కుమారి’ అనే స్టార్ హీరోయిన్ పాత్రలో నటించింది. జీరో మూవీలో షారుక్, అనుష్క పాత్రలకు ఏ మాత్రం తగ్గకుండా కత్రినా బబితా కుమారి పాత్ర కొనసాగుతుంది. ఈ సినిమాలో బబితాకుమారి తన కోస్టార్ అభయ్‌డియోల్‌కు బ్రేకప్ అవుతుంది.


జీరోలో షారుక్, అనుష్కల లవ్‌స్టోరీ ఓ వైపు నడుస్తుంటే..మరోవైపు కత్రినాకైఫ్, అభయ్‌డియోల్‌లో బ్రేకప్‌ స్టోరీ కొనసాగుతుంది. కత్రినా, రణ్‌బీర్ కపూర్ మధ్య ప్రేమ వ్యవహారం, బ్రేకప్‌కు ఈ సీన్లు దగ్గరగా ఉండటంతో..బబితాకుమారి పాత్ర కత్రినాకైఫ్ లవ్‌స్టోరీ నేపథ్యంలోనే డిజైన్ చేసిందని వార్తలు వచ్చాయి. అనుపమ్‌చోప్రాకు ఇచ్చిన ఇంటర్కూలో దీనిపై పరోక్షంగా సమాధానం చెప్పింది కత్రినా. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల ఆ సీన్లను నా కథకు ముడిపెట్టాలని ప్రయత్నిస్తారు. అయితే సినిమాను పూర్తిగా చూస్తే ఆ పాత్ర ఎంత భిన్నంగా ఉంటుందో అర్థమవుతుంది. నా ప్రవర్తన అలా ఉండదు. ఆ పాత్ర స్వభావం నాది కాదని స్పష్టం చేసింది కత్రినా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa