టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల 'ఓరి దేవుడా' అనే రొమాంటిక్ చిత్రంతో అలరించాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహిస్తున్న తన కొత్త చిత్రం నుండి విశ్వక్ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబందించిన కారణం తెలియదు కానీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో వైరల్‌గా మారింది.
ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించాలని అర్జున్ నిర్ణయించుకునట్లు సమాచారం. ఈ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ కథానాయికగా కనిపించనుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయునున్నారు.