తలపతి విజయ్ అభిమానులు ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూసిన వారిసు మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ కొంచెంసేపటి క్రితమే విడుదలైంది. తమన్ స్వరకల్పనలో క్లాస్సీ మ్యూజిక్ టచ్ తో కూడిన ఈ పాటకు విజయ్, రష్మిక మండన్నా అంతే క్లాస్ స్టెప్పులను వేసి, ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్నారు. పోతే, ఈ పాటను విజయ్ స్వయంగా ఆలపించారు.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా తమిళ, తెలుగు భాషలలో విడుదల కాబోతుంది. 'వారసుడు' టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది.