మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 16వ సినిమాకు సంబంధించి రోజుకొక కొత్త వార్త పుట్టుకొస్తూ, మెగాఫ్యాన్స్ ని కన్ఫ్యూషన్ లో పడేస్తుంది. అలానే మరింత ఎక్సయిట్మెంట్ కు కూడా గురి చేస్తుంది.
RC 16 గౌతమ్ తిన్ననూరితో క్యాన్సిల్ ఐన విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో RC 16 డైరెక్టర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముందుగా కన్నడ డైరెక్టర్ నార్తన్ తో చెర్రీ సినిమా ఉంటుందని అన్నారు. ఆ తరవాత సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నారని, ఇందుకు సంబంధించి కొంతమేర షూటింగ్ కూడా పూర్తయిందని కూడా ప్రచారం జరిగింది. సుకుమార్ - రాంచరణ్ ల సినిమా గురించి స్వయంగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలపడంతో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయం పక్కన పెడితే, ఉప్పెన తో తొలిసినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ బుచ్చిబాబు సాన రీసెంట్గా చెర్రీ ని కలిసి ఒక కథ వినిపించారట. అది చెర్రీకి కూడా చాలా నచ్చిందట. మరి, ఫుల్ మూవీని బుచ్చిబాబుతో చేస్తారా..?? ఈ ప్రాజెక్ట్ RC 16 ఆ ? లేక నెక్స్ట్ ప్రాజెక్టా ? అన్నది తెలియాల్సి ఉంది.