అల్లరి నరేష్ 59 చిత్రంగా నటిస్తున్న "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" నవంబర్ 11వ తేదీన విడుదల కావడానికి ముహూర్తం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఐతే, తాజాగా ఈ సినిమాను నవంబర్ 25వ తేదికి వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. వాయిదాకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని ఏఆర్ మోహన్ డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తుంది.