మోహన రాజా దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి నటించిన "గాడ్ ఫాదర్" సినిమా ఆగస్ట్ 5న తెలుగు మరియు హిందీలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 43.56 కోట్లు వసూలు చేసింది.
ఈ సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్, టోవినో థామస్, మంజు వారియర్ తదితరులు నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ లూసిఫర్‌కి రీమేక్. పొలిటికల్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, పూరి జగన్నాధ్, సునీల్, సత్యదేవ్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. గాడ్ ఫాదర్ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.
'గాడ్ ఫాదర్' డే వైస్ కలెక్షన్స్ :::::
1వ రోజు : 12.97 కోట్లు
2వ రోజు : 7.73 కోట్లు
3వ రోజు : 5.41 కోట్లు
4వ రోజు : 5.62 కోట్లు
5వ రోజు : 5.23 కోట్లు
6వ రోజు : 1.51 కోట్లు
7వ రోజు : 83 L
8వ రోజు : 62 L
9వ రోజు : 47 L
10వ రోజు : 41 L
11వ రోజు : 56 L
12వ రోజు : 81 L
13వ రోజు : 33 L
14వ రోజు : 22 L
15వ రోజు : 17 L
మిగిలిన రోజులు : 24 L
టోటల్ AP/TS కలెక్షన్స్ : 43.56 కోట్లు