రాకేశ్ శశి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షశివో' చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల సినీప్రేముకుల నుండి విమర్శకుల నుండి పాజిటివ్ టాక్ ని అందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు నెట్‌ఫ్లిక్స్ మరియు ఆహా ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ స్ట్రీమింగ్ రైట్స్ ని భారీ ధరకు పొందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో అల్లు శిరీష్ కి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, కేదార్ శంకర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని మరియు విజయ్ ఎం. అచ్చు రాజమణి నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు.