వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తెలుగు ద్విభాషా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళంలో "వాతి" అని తెలుగులో "సర్" టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది అని సమాచారం.
తాజగా ఇప్పుడు, ఈ సినిమా నుండి మొదటి సింగిల్ ని నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అదే విషయాన్ని తెలియజేసేందుకు ధనుష్ మరియు సంయుక్తా మీనన్ ఉన్న ఒక కూల్ పోస్టర్ ను విడుదల చేసారు. తమిళ వెర్షన్‌కి ధనుష్ సాహిత్యం అందించగా, రామజోగయ్య శాస్త్రి గారు తెలుగు సాహిత్యం రాశారు. ఈ పాటకు శ్వేతా మోహన్ స్వరాలు అందించనున్నారు.
ఈ సినిమాలో మలయాళ నటి సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్య దేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా "సర్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.