ఇండియన్ బిజినెస్ మ్యాన్ విజయ్ శంఖేశ్వర్ బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం "విజయానంద్". ఇందులో నిహాల్, సిరి ప్రహ్లాద్ జంటగా నటిస్తున్నారు. రిషిక శర్మ డైరెక్షన్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఆగి చూసే నా కన్నులే అనే బ్యూటిఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. గోపిసుందర్ స్వరపరిచిన ఈ పాటను విజయ్ ప్రకాష్, కీర్తన వైద్యనాధన్ ఆలపించారు. రాంబాబు గోలస లిరిక్స్ రాసారు.
VRL ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆనంద్ శంఖేశ్వర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వినయ ప్రసాద్, భరత్ బోపన్న, అనంత్ నాగ్, షైన్ శెట్టి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.