బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా "భేడియా". అమర్ కౌశిక్ ఈ సినిమాకు డైరెక్టర్. భారతదేశపు తొలి క్రియేచర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ నవంబర్ 25వ తేదీన హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది. దినేష్ విజన్ నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యింది. చిలిపి వరాలే ఇవ్వు అనే ఈ బ్యూటిఫుల్ లవ్ మెలోడీ యూత్ ను ఆకర్షిస్తుంది. యనమండ్ర రామకృష్ణ లిరిక్స్ అందించిన ఈ పాటను కార్తీక్ పాడారు. సచిన్ జిగర్ సంగీతం అందించారు.