సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ రీసెంట్గా "నచ్చింది గర్ల్ ఫ్రెండూ" మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే కదా. లేటెస్ట్ గా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుందని మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు. నవంబర్ 11న థియేటర్లలో విడుదల కావడానికి రెడీ ఐన ఈ సినిమాకు సెన్సార్ బృందం యూ/ఏ సెర్టిఫికెట్ ఇచ్చింది.
గురు పవన్ డైరెక్షన్లో ఉదయ్ శంకర్, జెన్నిఫర్ ఇమ్మానుయేల్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ను శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై అట్లూరి నారాయణరావు నిర్మించారు. గిఫ్టన్ ఇలియాస్ సంగీతం అందించారు.